telugu navyamedia
సినిమా వార్తలు

66సంవత్సరాల “మంచిమనసుకు మంచిరోజులు”

నటరత్న, పద్మశ్రీ ఎన్.టి. రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం శ్రీ ప్రొడక్షన్స్ వారి “మంచిమనసుకు మంచిరోజులు” 15-08-1958 విడుదలయ్యింది.

నిర్మాతలు సుందర్ లాల్ నహతా, టి. అశ్వర్థనారాయణలు శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు సి.యస్.రావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ: ఏ.కె.వేలన్, మాటలు: సముద్రాల రామానుజాచార్య, పాటలు: సముద్రాల ,కొసరాజు,
సంగీతం: ఘంటసాల, ఛాయా గ్రహణం: కమల్ ఘోష్ కళ: అణ్ణామలై, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
ఎడిటింగ్: ఎన్.కె.గోపాల్ అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, రాజసులోచన, రేలంగి, గిరిజ, రాజనాల, మిక్కిలినేని, రమణమూర్తి, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య, నల్ల రామమూర్తి, తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకులు, మధురగాయకులు ఘంటసాల గారి సంగీత సారధ్యంలో
“అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తాకొట్టిందిలే బుల్ బుల్ పిట్ట”
“కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం యేనాటికైనా మారేనా”
“రావే నా చెలియా నా జీవనమాధురి నీవే”
వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రం ఘనవిజయం సాదించి పలు కేంద్రాలలో 50 రోజులు, 6 కేంద్రాలలో డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది.
ఒక కేంద్రంలో 25 వారాలు ప్రదర్శిపబడింది.

100 రోజులు ఆడిన కేంద్రాలు…
1) విజయవాడ – శ్రీరామా (152 రోజులు),
2) గుంటూరు – సరస్వతి పిక్చర్ ప్యాలెస్,
3) నెల్లూరు – న్యూ టాకీస్,
4) రాజమండ్రి – కృష్ణ,
5) మచిలీపట్నం – దుర్గా మహల్,
6) కాకినాడ – లక్ష్మి
విజయవాడ – శ్రీరామా టాకీస్ (152 రోజులు)+ షిఫ్ట్ తో 175 రోజులు ( సిల్వర్ జుబ్లీ) ఆడింది…..

Related posts