తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాంచీపురంలోని అత్తి వరదరాజస్వామి ఆలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. తిరుగు ప్రయాణంలో చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజా నివాసానికి వచ్చారు. దాదాపు రెండు గంటలపాటు ఆయన రోజా నివాసంలోనే గడిపారు.
జగన్ ను పట్టుదల ఉన్న యువనేతగా కేసీఆర్ అభివర్ణించారు. రాయలసీమ సర్వతోముఖాభివృద్ధి విషయంలో తాను జగన్ కు పెద్దన్నలా వ్యవహరిస్తానని, అన్ని విషయాల్లో సాయంగా ఉంటానని స్పష్టం చేశారు. రాయలసీమ ఆర్థిక పురోభివృద్ధికి గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి తాను, జగన్ కలిసి పని చేస్తామని చెప్పారు.


ట్రయల్ మొదలైతే జగన్ దృష్టంతా కోర్టు బోనుపైనే: యనమల