బిగ్ బాస్ సీజన్-3 ప్రారంభమై 15 మంది కంటెస్టెంట్స్‌తో ఇప్పటికే రెండు ఎలిమినేషన్స్ పూర్తయ్యాయి. తొలి వారం హేమ ఇంటి నుండి బయటకి వెళ్ళగా, రెండో వారం జాఫర్‌ని ఎలిమినేట్ చేశారు. ప్రస్తుతం హౌజ్‌లో 14 మంది సభ్యులు ఉండగా… ఈ వారం నామినేషన్లో ఎక్కువ ఓట్లు పొందిన తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్లు ఎలిమినేషన్లో నిలిచారు. మూడోవారం కెప్టెన్ అయ్యేందుకు ఇంటి సభ్యులకి బిగ్ బాస్ దొంగలున్నారు జాగ్రత్త అనే టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హౌస్ లో సభ్యుల మధ్య విభేదాలు ఎక్కువవుతున్నాయి. గ్రూపులుగా మారి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. అయితే ఈ వీకెండ్ బిగ్ బాస్ హౌస్ లో హాట్ హాట్ గా ఉండబోతోంది. తప్పులు చేసిన ఇంటి సభ్యులని కడిగిపారేసేందుకు నాగ్ సిద్ధం అవుతున్నారు. శనివారం రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని స్టార్ మా రిలీజ్ చేసింది. శనివారం రోజు అలీ రెజాపై నాగార్జున ఒక రేంజ్ లో విరుచుకుపడబోతున్నట్లు ఈ ప్రోమో ద్వారా అర్థం అవుతోంది. ఇటీవల హౌస్ లో ముగిసిన దొంగతనం టాస్క్ లో అలీ రెజా, హిమజ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో తనని క్షమించమని హిమజ అలీ కాళ్లపై కూడా పడింది. ఈ విషయంలో నాగార్జున ఆలీకి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నాడు. అలీ.. నీ డ్రెస్ సెన్స్ బావుంది. కానీ కామన్ సెన్స్ లేదేంటయా నీకు.. ఆడపిల్లతో ప్రవర్తించేది అలాగేనా అంటూ నాగార్జున అలికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక మరో ప్రోమోలో మిగిలిన వారు చేసిన తప్పులపై కూడా స్పందించారు. దీంతో ఈరోజటి ఎపిసోడ్ పై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది.
previous post
next post