telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సైరా పూర్తి కాదా… మరో సారి బ్రేక్.. నటుడి మృతి..

Syeraa

‘సైరా’ సినిమాకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. చిరంజీవి హీరోగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండు సెట్లు వృథా అయిన సంగతి తెలిసిందే. దీంతోనే సినిమా చిత్రీకరణ ఆలస్యం అయిందని భావిస్తున్న వేళ, తాజాగా, రష్యాకు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ మృతిచెందాడు. టూరిస్ట్ వీసాపై మార్చిలో హైదరాబాద్ కు వచ్చి, సైరాలో ఓ పాత్రను పోషిస్తున్న అలెగ్జాండర్ (38) అనే వ్యక్తి గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్‌ గేట్‌ నెంబర్‌–1 వద్ద అపస్మారక స్థితిలో కనిపించాడు.

ఎండ వేడిమిని తాళలేక ఆయన పడిపోగా, పోలీసులు తొలుత కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి, ఆపై గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. అతని కెమెరాలోని చిత్రాల ఆధారంగా, 4, 5 తేదీల్లో సైరా సినిమాలో నటించాడని, గచ్చిబౌలి సమీపంలోని ఓ హోటల్‌ లో నివాసం ఉంటున్నాడని పోలీసులు గుర్తించారు. వడదెబ్బ కారణంగానే అలెగ్జాండర్‌ మృతి చెందాడని, గోవాలో ఉన్న అతని స్నేహితునికి సమాచారం ఇచ్చామని, అతను వచ్చిన తరువాత పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు.

Related posts