మన దేశంలో దళితులు, ముస్లింలు, ఇతర మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో విద్వేష దాడులు, మూక దాడులు, హత్యలు గణనీయంగా పెరిగాయి. మూకదాడులను వెంటనే నిరోధించాలంటూ సినీ ప్రముఖులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ కూడా రాశారు. ఇప్పటి వరకు 49 మంది ప్రముఖులు దీనిపై తమ వాదనని వినిపించగా ఇందులో ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనగల్, అపర్ణాసేన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, గాయకురాలు శుభ ముద్గల్, చరిత్రకారుడు రామచంద్ర గుహ, నటీమణులు రేవతి, కొంకణాసేన్ తదితరులు ఉన్నారు. జై శ్రీరాం అనే పేరును ఇతరులను రెచ్చగొట్టేలా ఓ రణ నినాదంగా మార్చడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. అసమ్మతి లేకపోతే ప్రజాస్వామ్య మనుగడే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై జాతి వ్యతిరేకులు, అర్బన్ నక్సల్స్ వంటి ముద్ర వేయడం సరికాదు అని స్పష్టం చేశారు. వారి వాదనని పలువురు ఏకీభవిస్తుండగా, పలువురు వ్యతిరేఖిస్తున్నారు. కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే కంగనా తాజాగా ఈ వివాదంపై స్పందించింది. కొంత మంది ప్రముఖులు తమ పవర్‌ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో అన్ని పరిస్థితులు దారి తప్పుతున్నాయి అని చెబుతున్నారు. కాని ఈ దేశంలో మొదటిసారి అన్ని సరైన దిశలో వెళుతున్నాయి అని కంగనా పేర్కొంది. మార్పులో మేము భాగంగా ఉన్నాము. దేశంలో ఇప్పుడిప్పుడే మంచి పరిస్థితులు వస్తున్నాయి. వీటిని చూసి కొందరు కలత చెందుతున్నారు. సామాన్య ప్రజలు తమ నాయకులని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నారు , కాని వారిని కొందరు తప్పుపట్టడం బాధగా ఉందంటూ సంచలన కామెంట్స్ చేసింది కంగనా.
previous post