బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ నటించిన హౌస్‌ఫుల్ 4 చిత్రం రీసెంట్‌గా విడుదలై మంచి విజయం సాధించింది. అయితే బీహార్ వరదల కారణంగా కొన్ని లక్షలమంది నిరాశ్రయులయ్యారు. వారికి ఉపాధి కరువయ్యింది. కనీసం తిండి కూడా అందక విలవిలలాడిపోయారు. ఈ నేపధ్యంలో సీఎం రూ. 136.58 కోట్ల మొత్తాన్ని బాధితులను ఆదుకునేందుకు అందించారు. తాజాగా అక్షయ్ బీహార్ వరదబాధితులకి తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు . వరదల వలన 25 కుటుంబాలు రోడ్డున పడగా, ఒక్కో కుటుంబానికి 4 లక్షల చొప్పున సాయం అందించాలని ఆయన ప్రతిపాదించారు. చాత్ పూజ శుభ సందర్భంగా రూ. 1 కోటి రూపాయల మొత్తాన్ని అందజేయనున్నారు. ప్రకృతి కోపానికి మనుషులు రోడ్డున పడుతున్నారు. వారికి సాధ్యమైనంత సహాయం చేసేందుకు అందరూ ముందుకు రావాలని అక్షయ్ పిలుపునిచ్చారు. తోటి పౌరుల జీవితాలను పునర్నిర్మించడం కోసం చేసే సహాయం తనకు ఎనలేని సంతృప్తిని ఇస్తుందని అక్షయ్ అన్నారు. ఈ యంగ్ హీరో సినిమాల కన్నా సేవా కార్యక్రమాలతోనే అందరి మనసులని గెలుచుకుంటున్నారు. సామాజిక బాధ్యత కలిగిన పౌరుడిగా ఆయన ఎన్నో సామాజిక సేవలు చేశారు. అవసరమైన వారికి సహాయం అందించడంలో అక్షయ్ ఎప్పుడు ముందుంటారు.
previous post
హీరోయిన్ అంజలి, హీరో జై ఓకే రూమ్ లో… నిర్మాత షాకింగ్ కామెంట్స్