మనసులోని మాటను బయటకు చెప్పే వైఎస్ నైజమే జగన్ లో కనిపించిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ రోజు రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఢిల్లీలో జగన్ మీడియాతో మాట్లాడినపుడు తనకు జగన్ లో వైఎస్ స్పష్టంగా కనిపించారని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ సాధించలేని ఘన విజయాన్ని నమోదు చేసి వైఎస్ జగన్ ను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.
ఎన్టీఆర్ ఘన విజయాన్ని సాధించిన వేళ కూడా ఆయన ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకు సాగారని, జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేశారని గుర్తు చేశారు.మోదీని కలిసి వచ్చిన తరువాత, ఆయనకు పూర్తి మెజారిటీ రాకూడదని కోరుకున్నానని జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆ మాటలు చాలా మంచి గుణానికి సంకేతమని తెలిపారు. జగన్ ఇదే విధంగా వ్యవహరిస్తే మంచి జరుగుతుందని అన్నారు.


చంద్రబాబుపై తమకు ఎలాంటి కక్ష లేదు: మంత్రి బొత్స