దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పని చేద్దామని వైసీపీ శాసనసభపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. నన్ను శాసనసభపక్ష నాయకుడిగా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..ప్రతి గ్రామంలోని కార్యకర్త నాకు తోడుగా ఉండడంతోనే ఈ విజయం సాధ్యమైంది అని పేర్కొన్నారు. ప్రజలు మనకు గొప్ప బాధ్యత అప్పగించారన్నారు.
ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించాలన్నారు. విలువలు, విశ్వసనీయతకు ప్రజలు ఓటేశారని చెప్పారు. ఆరు నెలల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని తెలిపారు.సుపరిపాలనకు మీ అందరి సహాయ సహకారాలు కావాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధించాలని అన్నారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచింది వైఎస్సార్సీపీనే అని పేర్కొన్నారు.


ఇప్పడు మోదీలో భయం కనిపిస్తోంది: రాహుల్