శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య జంటగా నటించిన “మజిలీ” చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం థియేటర్లలో ఈ రోజుతో 25 సెంటర్స్ లో 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఈ పోస్టర్ ద్వారానే కృతజ్ఞతలు తెలిపారు. “మజిలీ” సినిమాకు పోటీగా కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ వాటి పోటీని తట్టుకుని ఇన్ని రోజులు థియేటర్లలో రన్ కావడం అనేది విశేషమే. ఇక సాధారణంగా ఏ భాషలోనైనా ఓ సినిమా హిట్ అయితే ఆ సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఈ చిత్రాన్ని కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. త్వరలోనే తన సొంత బ్యానర్ వండర్ బార్ ఫిలింస్ సంస్థపై ధనుష్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నాడు.
previous post
ఇక రీమిక్స్ సాంగ్స్ కు దూరం… బాలూ గారు తిడుతున్నారు : తమన్