తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈనెల 13న కానున్నాయి. సోమవారం ఉదయం 11:30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. సచివాలయంలోని డీ-బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో విద్యాశాఖ అధికారులు ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 4,75,757 మంది విద్యార్థులకు హాల్టిక్కెట్లు విడుదల చేయగా వారిలో 4,73,321 మంది హాజరయ్యారు. ఫలితాలు వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
previous post
గవర్నర్ దగ్గర జగన్ చెప్పినవన్నీ అబద్ధాలే: డొక్క