ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రత్యేక సమగ్ర సవరణ-2019కు సంబంధించి జనవరి 11న తుది జాబితా ప్రచురించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 24,12,626 మంది ఓటర్లు పెరిగారు. రెండున్నర నెలల వ్యవధిలో ఈ పెరుగుదల చోటుచేసుకుంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో పురుష ఓటర్లు కంటే 4,17,082 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఓటర్ల సంఖ్య 42 లక్షలు దాటింది. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా ఓటర్ల సంఖ్య 18.18 లక్షలే. మిగతా అన్ని జిల్లాల్లోనూ ఓటర్ల సంఖ్య 20 లక్షలు మాత్రమే. రాష్ట్రంలో శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలు మిన హా మిగతా అన్ని జిల్లాల్లోనూ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.