దిత్వా తుపాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీలంకకు భారత్ తన సహాయ సహకారాలను విస్తరించింది.
‘ఆపరేషన్ సాగర్ బంధు’లో భాగంగా భారత వాయుసేనకు చెందిన సీ-130జే విమానం శనివారం సుమారు 12 టన్నుల సహాయ సామగ్రితో కొలంబోలో ల్యాండ్ అయింది.
ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. “ఆపరేషన్ సాగర్ బంధు కొనసాగుతోంది.
టెంట్లు, టార్పాలిన్లు, దుప్పట్లు, పరిశుభ్రత కిట్లు, తినడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలతో కూడిన 12 టన్నుల సామగ్రి కొలంబో చేరింది” అని ఆయన తెలిపారు.
నౌకల ద్వారా 4.5 టన్నుల పొడి రేషన్, 2 టన్నుల తాజా రేషన్తో పాటు ఇతర నిత్యావసరాలను బాధితులకు పంపిణీ చేసినట్లు కొలంబోలోని భారత హైకమిషన్ పేర్కొంది.
దిత్వా తుపాన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. “మా సమీప సముద్ర పొరుగు దేశానికి సంఘీభావంగా అత్యవసర సహాయ సామగ్రిని పంపాము.
అవసరమైతే మరింత సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ‘నైబర్హుడ్ ఫస్ట్’ పాలసీకి కట్టుబడి కష్టకాలంలో శ్రీలంకకు అండగా నిలుస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.


ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణం: కేజ్రీవాల్