భారత ప్రధాని నరేంద్రమోదీ తన దేశ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను మొదటగా పరిగణిస్తారని, విదేశీ ఒత్తిడికి లొంగరని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు .
పీఎం మోదీని ‘విజ్ఞత ఉన్న నాయకుడు’గా ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు భారత-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించారు.
సోచీలో నిర్వహించిన వల్దాయి క్లబ్ ప్లీనరీ సెషన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్, రష్యా మధ్య ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ 15 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని, ఇది రెండు దేశాల మధ్య బలమైన సంబంధాన్ని సూచిస్తుందని పుతిన్ తెలిపారు.
రష్యన్ చమురుపై ఆధారపడిన భారత్, వాటి కొనుగోళ్లు ఆపితే 9 నుంచి 10 బిలియన్ డాలర్ల నష్టం జరుగుతుందని, ఈ విషయంలో ఎవరు అవమానించినా భారతీయులు సహించరని పుతిన్ అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూక్రెయిన్ యుద్ధం సాకుగా చూపి భారత్, చైనా దేశాలను రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపాలని హెచ్చరించారు.
అంతేకాదు,భారత్ పై ప్రత్యేక ట్రేడ్ టారిఫ్స్ కూడా విధించిన సంగతి తెలిసిందే.
ఇలా ఉండగా, డిసెంబర్‌లో పుతిన్ భారత్ సందర్శనకు రానున్నారని, రష్యన్ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పినట్టు సమాచారం.
భారత్ వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని, రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అనేది రాజ్యాంగ విరుద్దం: సుజనా చౌదరి