telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ నగరానికి కొత్త పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ నియమితులయ్యారు

తెలంగాణ పోలీస్ యంత్రాంగంలో ప్రభుత్వం భారీ స్థాయిలో మార్పులు చేపట్టింది. రాష్ట్రంలోని పలు కీలక విభాగాల్లో పనిచేస్తున్న 23 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మార్పుల్లో భాగంగా, హైదరాబాద్ నగరానికి కొత్త పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ నియమితులయ్యారు.

ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సేవలందిస్తున్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.

ఆయన స్థానంలో, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీసీ సజ్జనార్‌ను నియమించారు.

సజ్జనార్ బదిలీతో ఖాళీ అయిన ఆర్టీసీ ఎండీ పోస్టులో, తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల డీజీగా ఉన్న వై. నాగిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Related posts