telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుంటున్నాము: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ నగరంలోని గాజుల రామారంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణ కూల్చివేతలు హైడ్రా చేపట్టింది.

దేవేంద్రనగర్, బాలయ్యనగర్, హబీబ్‌నగర్‌లోని మూడు నాలుగేళ్లలోనే వేల కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని కేటుగాళ్లు కబ్జా చేసినట్టు హైడ్రా గుర్తించింది.

తాజాగా, ఈ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భూకబ్జాలో రాజకీయ నాయకులు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారని ఆయన తెలిపారు.

మొత్తం 40 ఎకరాల్లో పేదల ఆవాసాలు ఉన్నాయని వివరించారు. స్థానిక నాయకులతో అధికారులు కుమ్మక్కై భూమిని ఆక్రమించుకుని వాటిని పేదలకు స్థలాలు విక్రయించారని పేర్కొన్నారు.

ఆరు నెలల్లో ఐదారు విడతలుగా స్థానికులతో హైడ్రా, రెవెన్యూ అధికారులు మాట్లాడినట్టు వివరించారు.

కబ్జాలు, అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు.

Related posts