telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్‌ రూ.11 కోట్ల సీజ్‌, సిట్‌ ని వివరాలు కోరిన ఈడీ

ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ కేసులో ఈడీ ఎంట్రీ అయింది. ఈ కేసులో భాగంగా రూ.11 కోట్ల సీజ్‌కు సంబంధించిన వివరాలు కావాలని సిట్‌ను ఈడీ కోరింది.

లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. నిన్న శంషాబాద్ కాచారంలో సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్లకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఈడీ కోరింది.

ఇదే కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసిన ఈడి ఇటీవల చంద్ర రెడ్డి సైతం విచారించింది.

తాజాగా ఈ రూ.11 కోట్లు సీజ్ చేసిన వ్యవహారంలో మరికొందరికి ఈడీ నోటీసులు ఇవ్వనుంది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఓవైపు సిట్, మరోవైపు ఈడీ విచారణను వేగవంతం చేసింది.

లిక్కర్ స్కామ్ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు వరుణ్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.

A1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కలెక్షన్ గ్యాంగ్‌లో వరుణ్ కీలక వ్యక్తిగా గుర్తించారు.

అయితే ఈ లిక్కర్ కేసు నమోదైన వెంటనే వరుణ్‌ను కొందరు కీలక వ్యక్తులు దేశం దాటించారు.

ఇప్పటికే వరుణ్‌పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

ఈ కేసుకు సంబంధించి వరుణ్ నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు.

ఇవాళ, రేపు మరికొన్ని ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో సహా మరో 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Related posts