అన్యమతాలకు చెందిన నలుగురు ఉద్యోగులను టీటీడీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.టీటీడీలో పనిచేస్తూ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్టు విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదక ఆధారంగా సస్పెండ్ చేశారు.ఈ సస్పెన్షన్లపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.
ఎక్స్ వేదికగా బండి సంజయ్ స్పందిస్తూ… తమ డిమాండ్ మేరకు అన్యమతాలకు చెందిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
ఇది ప్రారంభం మాత్రమేనని… ఇప్పటికీ తిరుమలలో హిందువులు కానివారు వందల మంది పనిచేస్తున్నారని అన్నారు.
హిందువులు పవిత్రంగా భావించే అలాంటి స్థలంలో ఇతర మతస్తులకు స్థానం లేదని చెప్పారు. మిగిలిన అన్యమత ఉద్యోగులను కూడా వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.