telugu navyamedia
వార్తలు సామాజిక

క్లాసులకు హాజరవ్వండి.. స్కూల్‌ యాజమాన్యం

half day schools in AP since high temp

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ను పొడిగించింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్ల వంటి విద్యా సంస్థలు తెరవడానికి అనుమతి లేదని, లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా అవి తెరుచుకోవడానికి మరికొంతకాలం పడుతుందని ప్రకటించింది. అయినప్పటికీ గుజరాత్‌ రాష్ట్రంలోని ఓ పాఠశాల.. స్కూల్‌ను తెరుస్తున్నామని విద్యార్థులకు సమాచారం అందించింది. రాజ్‌కోట్‌లోని స్వామి వివేకానంద స్కూల్‌ యాజమాన్యం విద్యార్థులు క్లాసులకు హాజర్వండని పేర్కొంది.

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన రాష్ట్రాల్లో గుజరాత్‌ రెండో స్థానంలో ఉన్నది. గుజరాత్‌లో ఇప్పటివరకు 4,721 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 236 మంది మరణించారు. రాష్ట్రంలో ఇంకా 3750 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికీ  తగ్గలేదు. 

Related posts