బనకచర్ల వల్ల ఎవరికీ నష్టం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుస్పష్టం చేశారు. సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రాజెక్టులపై నేనెప్పుడూ వ్యతిరేకించలేదని క్లారిటీ ఇచ్చారు. నీటి సమస్య పరిష్కారమైతే తెలుగువారు బాగుపడతారని ఉద్ఘాటించారు.
కుప్పంలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటించారు. కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో కేంద్రం ప్రారంభించారు. రైతులను అన్నివిధాలా ఆదుకునే ప్రభుత్వం తమదని వెల్లడించారు.
ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయంలో లాభాలు వస్తాయని తెలిపారు. ఫుట్ ప్రాసెసింగ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్‌పై చర్చిస్తున్నామని అన్నారు.
మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు చేయాలని సూచించారు.
ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారాయని చెప్పుకొచ్చారు. ఏ పంట వేస్తే లాభదాయకమో కూడా ఆలోచిస్తున్నామని అన్నారు. తమిళనాడులో లేని ఫుడ్ ప్రాసెసింగ్ ఏపీలో ఉందని ఉద్ఘాటించారు.
సుపరిపాలనలో తొలిఅడుగులో భాగంగా ఇంటింటికీ వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారని ఆరోపించారు.
తప్పుడు పనులు తాత్కాలికం.. చేసిన పనులే శాశ్వతమని వ్యాఖ్యానించారు. తానెప్పుడూ తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు.
కారు కింద పడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించే ఓపిక కూడా లేదా అని ప్రశ్నించారు. కనీస బాధ్యత, సామాజిక స్పృహా లేకుండా ప్రవర్తిస్తారా అని నిలదీశారు.
కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేస్తారా అని ఫైర్ అయ్యారు.
సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు. నీతిమాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని విమర్శించారు.
చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయని వాళ్లు తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దోచుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పేదలను మీరు ఆదుకోకపోగా.. పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.