telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

వైసీపీ ప్రభుత్వం వస్తే .. ప్రభుత్వ పథకాలన్నీ డోర్ డెలివరీ .. : జగన్

YS Jagan Files Nomination Pulivendul

వైసీపీ అధినేత జగన్ నేడు పలాసలో ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఆరోజు జాబు రావాలంటే బాబు రావాలని చెప్పారనీ, ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాలని జగన్ వ్యాఖ్యానించారు. ఏపీలో 1.7 కోట్ల ఇళ్లు ఉంటే, ఉద్యోగాలు లేని యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2,000 ఇస్తామని హామీ ఇచ్చారనీ, దాన్ని కూడా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రజలందరి దీవెనలతో అధికారంలోకి రాగానే ఎన్నీ లక్షలు ఖర్చయినా వెనకాడకుండా పిల్లలను చదవిస్తామనీ, ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ అన్నారు.

నాటి లెక్కల ప్రకారం(2014) 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని జగన్ తెలిపారు. ఆనాటి నుంచి మన రాష్ట్ర యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్‌ తీసుకుంటూ డబ్బులు ఖర్చుపెడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఖాళీలున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఏటా 10వ తరగతి పాస్‌ అయ్యేవారు 5 లక్షల మంది ఉన్నారు. 4 లక్షల మంది ఇంటర్‌ పాస్‌ అవుతున్నారు. 1.8 లక్షల మంది ఏటా మంది డిగ్రీ పాసై బయటకు వస్తున్నారు. ప్రతీ సంవత్సరం 1.10 లక్షల మంది పీజీ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. వీరందరికి ఉద్యోగాలు కల్పించేలా కార్యచరణ రూపొందిస్తాం అని జగన్ ప్రకటించారు.

రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఊరి లో ముందుగా చెప్పినట్టుగా సచివాలయం ఏర్పాటు చేస్తామని, తద్వారా 10 మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. అలాగే ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను పెడతాం. వారికి రూ.5,000 గౌరవ వేతనం అందిస్తాం. ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఆ యాబై ఇళ్లకు వాలంటీర్లే డోర్‌ డెలివరీ చేస్తారు. ప్రభుత్వ పథకాల కోసం ఎవ్వరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే పరిష్కరిస్తాం. ప్రతి జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యం పెంచేందుకు స్కిల్‌డెవలెప్‌మెంట్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. నవరత్నాల్లో ఇవన్నీ వివరించడం జరిగింది. మన జీవితాలు బాగుపడాలంటే నవరత్నాలు ప్రతి ఇంటికి వెళ్లాలి’ అని జగన్ అభిప్రాయపడ్డారు.

Related posts