ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవడానికి యోగా అమూల్యమైన సాధనమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు.
యోగా శరీరం, మనస్సు, ఆత్మకు మధ్య సమతుల్యతను సాధించే ప్రాచీన భారతీయ సంప్రదాయ విధానమని అన్నారు.
నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని, ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడంలో ఎంతో తోడ్పాటునిస్తుందని “ప్రపంచ యోగా దినోత్సవం” సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక సందేశంలో పేర్కొన్నారు.

