telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అడ‌వి సింహామే రారాజు.. జ‌గ‌నే ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ఎప్ప‌టికీ మ‌హారాజు..

బద్వేల్‌ ఉప ఎన్నిక ప్రచారంలో వైకాపా జోరు పెంచింది. వైకాపా పోటీలో లేద‌ని తెదేపా, జ‌న‌సేన పార్టీలు అంటున్నారు . దొంగ‌లు అంతా ఒక చోటకు చేరి వైకాపాపై దాడి చేయాల‌ని బీజేపీ ముందు పెట్టి డ్రామాలు ఆడుతున్నాయ‌ని బద్వేల్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గోపవరం మండలం రాచాయపేటలో నిర్వహించిన బహిరంగ సభలో వ‌చ్చిన‌ సినిమా డైలాగులు వాడేశారు.

తెదేపా కానీ, గ్లాసు పార్టీ నాయ‌కుడు గానీ రాజ‌కీయంగా విలువ‌లు లేకుండా ప్యాకేజీలు కోసం ప‌నిచేస్తూ .. ఎప్ప‌డు ఎన్నిక‌లు వ‌స్తే అప్ప‌డు వ‌చ్చి ప్ర‌జ‌లను మాయ మాట‌లు చెప్పి మోసం చేయాల‌ని చూస్తుంటారు. అలాంటి మోస‌గాళ్ళ‌కి మీరు ఫాలో చేస్తే ఓటు ఎలా ఉండాలంటే ఎవ‌రూ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాళ్ళే వైఎస్ఆర్ సీపీ ఓట‌ర్లు అంటూ రోజా డైలాగ్స్‌ వేశారు.

అడ‌వి సింహామే రారాజు..ఈ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ఎప్ప‌టికీ మ‌హారాజు జ‌గ‌నే అని రోజా అన్నారు. ఈ రాష్టంలో ఒకే ఒక జెండా ఒకే ఒక అజెండా జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిదే అన్న‌ట్లుగా న‌డ‌వాల‌ని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలన అందిస్తున్నారని, జగన్‌పై ఉన్న అభిమానాన్ని బద్వేల్‌ ఉప ఎన్నికలో చూపించాలని అభ్యర్థించారు.

జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిదే దేశంలోనే గొప్ప మనసున్న నాయకుడు జగన్‌ అని అన్నారు. క‌డ‌ప పులి బిడ్డ‌, వైయస్‌ఆర్ ముద్దు బిడ్డ అయిన జ‌గ‌న్ మోహ‌న్ గారి సొంత జిల్లాలోని ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. బద్వేల్ గ‌డ్డ వైకాపాకి అడ్డా అని మీరు అంద‌రూ కూడా నిరూపిస్తార‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాన‌ని అన్నారు. ప్యాన్ గుర్తుకి ఓటు వేసి వైకాపా అత్య‌థిక మెజార్టీతో గెలిపించాల‌ని అన్నారు.

ముఖ్యంగా మహిళాల‌ సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని గుర్తు చేశారు రోజా. ఈ రోజు వైకాపా పోటీలో లేద‌ని తెదేపా, జ‌న‌సేన పార్టీలు అంటున్నారు కానీ..వీళ్ళంతా దొంగ‌లు అని

Related posts