telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్‌ఐఏకు బదిలీ..

YS Jagan Case transfer to NIA

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. జగన్‌పై హత్యాయత్నం కేసును ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఎన్‌ఐఏ యాక్ట్‌ ప్రకారం కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేయాలని వైఎస్‌ జగన్‌ తరపు న్యాయవాది గత విచారణలో కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని పిటిషనర్‌ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తితో జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. ఎన్‌ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేయాలని గతంలో పిటిషన్ దాఖలైంది. దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాలు తారుమారు అవుతాయని పిటిషనర్ వాదించారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు నిర్ణయం చెప్పాలని గతంలోనే ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. తాజాగా ఏపీ హైకోర్టు తీర్పునిస్తూ జగన్‌పై దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది.

Related posts