కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారాలను ప్రకటించింది.
2024 ఏడాదికి గాను గొప్ప ప్రదర్శనలు కనబరిచిన నలుగురు క్రీడాకారులను ఖేల్ రత్న కోసం ఎంపిక చేసింది.
స్టార్ షూటర్ మను బాకర్ కు కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది.
మనుతో పాటు ఇటీవల వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ విజేత గుకేశ్ కుమార్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ లకు కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది.
ఈ నెల 17న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో అవార్డులను ప్రదానం చేయనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ ప్రకటించింది.
చంద్రబాబు అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేస్తున్నాడు: ఏపీ మంత్రులు