తిరుమల తిరుపతి దేవదేవుడు శ్రీవారికి అరుదైన సేవలు చేసే పనిలో పడ్డారు తిరుమల అర్చకులు. నెల రోజుల పాటు ఆపదమొక్కుల వాడిని సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనంతో మేల్కొల్పనున్నారు. ఈ నెల 16 నుంచి జనవరి 14 వరకు సాగనుంది ఈ ఆధ్యాత్మిక తంతు. నిత్యం సుప్రభాత సేవతో మేల్కొనే కలియుగ వేంకటేశ్వరుడు. ధనుర్మాసంలో నెలరోజుల పాటు తిరుప్పావై పఠనంతో రోజును ప్రారంభించనున్నారు. ధనుర్మాసంలో నెలరోజుల పాటు శ్రీవారికి సుప్రభాతానికి బదులుగా గోదాదేవి రచించిన పాసురాలుతో మేల్కొలుపు జరుగుతుంది. శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన 30 పాశురాలనే గోదాదేవి పాశురాలు అంటారు. వీటిని ధనుర్మాస నెలలో ప్రతి రోజూ ఒక్కో పాశురాన్ని సుప్రభాతంకు బదులుగా పఠిస్తు స్వామి వారిని మేల్కోపుతారు అర్చకులు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఈనెల రోజుల పాటు స్వామి వారికి నిర్వహించే సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసిదళాల బదులుగా బిల్వపత్రాలతో నిర్వహిస్తారు. స్వామి వారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తికి కాకుండా శ్రీకృష్ణునికి నిర్వహిస్తారు.
ఇప్పటికీ పరమ భక్తురాలైన గోదాదేవి తరపున శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు జరిగే మోహినీ అవతారం సందర్భంగా పుత్తూరు నుండి అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు, చిలుకతో పాటు, గరుడ సేవలో అలంకరించేందుకు తులసి మాలలు స్వామి వారికి సమర్పిస్తారు. జనవరి 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను పునరుద్దరిస్తారు. దేవతలకు 6 నెలలు కాలం పగలుగా మరో 6 నెలలు కాలం రాత్రిగా పరిగణిస్తారు. ఇక ధనుర్మాసం నెల దేవతలకు బ్రహ్మముహుర్తంగా పరిగణిస్తారు. ఆ సమయంలో దేవతలు ఎంతో ప్రశాంతంగా ఉంటారనీ….ఆ వేళలో భక్తులు దేవతలను పూజిస్తే సులభంగా ప్రశన్నమవుతారన్నది భక్తుల విశ్వాసం. మరో వైపు శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం నెలలో వైకుంఠ ఏకాదశిని నిర్వహిస్తారు. ఏడాదికి 2రోజులు పాటు తెరిచి వుంచే వైకుంఠ ద్వారా భక్తులకు దర్శనం లభించేది ధనుర్మాసం నెలలోనే.
ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణం: కేజ్రీవాల్