telugu navyamedia
సినిమా వార్తలు

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు… ఉత్తమ తెలుగు సినిమాగా కార్తీకేయ 2

70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ఈరోజు ప్రకటించారు. ఈ అవార్డులు 2022లో ఉత్తమ చలనచిత్ర రంగాన్ని సత్కరిస్తాయి.

మలయాళ చిత్రం “ఆటం” ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి “కాంతారా” చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. నిత్యా మీనన్‌ ఉత్తమ నటి.

ఈసారి ఒక్క తెలుగు సినిమా మాత్రమే జాతీయ అవార్డును గెలుచుకుంది. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’ నిలిచింది.

70వ జాతీయ చలన చిత్ర అవార్డులు…

ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం)
ఉత్తమ నటుడు: రిషప్ శెట్టి (కాంతార, కన్నడ సినిమా)
ఉత్తమ నటి – నిత్యామీనన్, మానసి పరేఖ్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – కార్తికేయ-2 (తెలుగు)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – కేజీయఫ్-2 (కన్నడ)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – పొన్నియన్ సెల్వన్-1 (తమిళం)
ఉత్తమ దర్శకుడు – సూరజ్ బర్జాత్యా
బెస్ట్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషన్, ఎన్విరాన్‌మెంటల్ వ్యాల్యూస్ – కచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ)
ప్రేక్షకాదరణ పరంగా ఉత్తమ వినోద్మాక చిత్రం- కాంతార (కన్నడ)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – బ్రహ్మాస్త్ర-1:శివ (హిందీ)
ఉత్తమ డెబ్యూ దర్శకుడు – ప్రమోద్ కుమార్, ఫౌజా (హరియాన్వీ)
ఉత్తమ సహాయ నటి – నీనా గుప్తా
ఉత్తమ సహాయ నటుడు – పవన్ రాజా మల్హొత్రా
ఉత్తమ సినిమాటోగ్రఫీ – పొన్నియన్ సెల్వన్ పార్ట్-1 (తమిళం), సినిమాటోగ్రాఫర్: రవి వర్మన్
ఉత్తమ ఫిమేల్ బ్లే బ్యాక్ సింగర్ – బాంబే జయశ్రీ,
ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – శ్రీపాథ్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – నిక్కి జోషి
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – ఆనంద్ ఆద్య
ఉత్తమ ఎడిటింగ్ – ఆట్టమ్ (ఎడిటర్ మహేశ్ భువనేండ్)
ఉత్తమ సౌండ్ డిజైన్ – పొన్నియన్ సెల్వన్-1 (డిజైనర్ ఆనంద్ కృష్ణమూర్తి)
ఉత్తమ స్క్రీన్ ప్లే – ఆట్టం (ఆనంద్ ఏకర్షి)
ఉత్తమ మాటల రచయిత – అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ – అన్బరివు (కేజీఎఫ్2)
ఉత్తమ కొరియోగ్రఫీ – జానీ మాస్టర్, సతీశ్ కృష్ణన్ మాస్టర్
ఉత్తమ లిరిక్స్ – ఫౌజా (హరియాన్వీ),
ఉత్తమ సంగీతం – బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ (ప్రీతమ్)
ఉత్తమ నేపథ్య సంగీతం – పొన్నియన్ సెల్వన్-1 (ఏఆర్ రెహ్మాన్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – ఒడియా – దమన్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – మలయాళం – సౌదీ వెళ్లక్క సీసీ 225/2009
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – మరాఠీ – వాల్వీ (ది టైర్మైట్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – హిందీ – గుల్ మొహర్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – బెంగాళీ – కబేరీ అంతర్థాన్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – పంజాబీ – బాగీ డి దీ
బెస్ట్ టివా ఫిల్మ్ – సికాసిల్

Related posts