telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమితాబ్ ట్వీట్ పై నెటిజన్ల అసహనం

Amitab Bachchan Tweet on RGV

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలో 9 నిమిషాల పాటు దీపాలు వెలగించాలంటూ దేశప్రజలకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బీ ఆదివారం మొత్తం చీకటిగా ఉన్న ప్రపంచ పటంలో భారదేశం వెలుగుతూ ఉన్న ఓ ఫేక్‌ పోస్టును ట్విటర్‌లో షేర్‌ చేశారు అమితాబ్. ‘ప్రపంచం అంధకారంలో ఉన్నప్పుడు భారతదేశం ప్రకాశిస్తుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ’ అంటూ ట్వీట్‌ చేసిన ఆయన తరువాత అసలైన పోస్టును రీట్వీట్‌ చేశారు. ‘‘ప్రపంచం మనల్ని చూస్తోంది, అందులో మనం ఒకరం’’ అంటూ ట్వీట్‌ చేశారు. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ నకిలీ ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నందుకు ఆయనపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనాపై అజాగ్రత్త వద్దంటూ అవగాహన కల్పించడంలో ముందున్న బిగ్‌బీ సమాచారం ఇచ్చేముందు జాగ్రత్త వహించాలని అభిమానులు కోరారు. అంతేగాక గతంలో కూడా కరోనాను ఎదుర్కొవటానికి ఆయుష్‌ మంత్రిత్వశాఖ తీసుకుంటున్న చర్యలకు మద్దతునిస్తూ.. హోమియోపతిలోని గోమూత్ర వైద్యం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని సూచించి విమర్శల పాలయ్యారు. అంతేగాక చైనా షేర్‌ చేసిన ఓ వీడియోను బిగ్‌బీ షేర్‌ చేస్తూ.. ‘‘అంటువ్యాధుల నివారణలో ప్రపంచాన్ని భారతదేశం నడిపిస్తుందని ఆశిస్తున్నాను’’ అంటూ చేసిన ట్వీట్‌ను భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది.

Related posts