కర్ణాటక రాష్ట్ర అటవీశాఖ అధికారులతో సమావేశం. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరి కట్టేలా ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పని చేసేలా కార్యాచరణ. అక్కడ ప్రభుత్వ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది.
ఈ నెల 13న శ్రీహరి కోటకు ఆయన వెళ్లనున్నారు.
కుంకి ఏనుగుల మనుగడ, జీవన విధానంలో మార్పుపై పవన్ చర్చించనున్నారు. వాటి రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, మనుగడ పైనా ఆ రాష్ట్ర అధికారులతో ఆయన మాట్లాడనున్నారు.
చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి.
ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరం.
ఈ కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉన్నాయి. కొన్ని కుంకీ ఏనుగులు మన రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను పవన్ కోరనున్నారు.
ఇరు రాష్ట్రాల అటవీశాఖ అధికారులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

