ఆంధ్ర పోలీస్ శాఖ టెక్నాలజీ వినియోగంలో మరోసారి సత్తా చాటింది. జాతీయస్థాయిలో పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగం పై నిన్న స్కోచ్ గ్రూప్ ప్రకటించిన 18 అవార్డులలో ఐదు అవార్డులను సొంతం చేసుకున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచింది. తాజాగా స్కోచ్ గ్రూప్ ప్రకటించిన అవార్డులలో ఏపీ పోలీస్ శాఖ ఐదు అవార్డులు గెలుచుకోగా అందులో ప్రాజెక్ట్ టాటా, సైబర్ మిత్ర(మహిళ భద్రత) రజత పతకాలు కైవసం చేసుకున్నాయి. జాతీయ స్థాయిలో భారీగా అవార్డులను కైవసం చేసుకోవడం ఏపీ పోలీసులకు నెల వ్యవధిలో ఇది మూడోసారి. సైబర్ మిత్ర తో పాటు అఫెండర్ సెర్చ్, ఉమెన్ సేఫ్టీ (విజయనగరం జిల్లా),సువిధ(అనంతపురం), ప్రాజెక్ట్ టాటా (ప్రకాశం జిల్లా)విభాగాల్లో ఐదు స్కోచ్ అవార్డులు లభించాయి. కేవలం 11 నెలల కాల వ్యవధిలో 108 జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది ఏపీ పోలీస్ శాఖ. ఇప్పటి వరకు సాధించిన అవార్డులలో రెండు బంగారు, 13 రజిత పతకాలను ఏపీ పోలీస్ శాఖ సాధించింది. అందుబాటులో ఉన్న అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న సిబ్బందిని సీఎం జగన్ అభినందించారు.
previous post