telugu navyamedia
సినిమా వార్తలు

47 సంవత్సరాల “ఎదురీత”

నటరత్న పద్మశ్రీ ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం ఇందిరా మూవీస్ వారి “ఎదురీత”
22-07-1977 విడుదలయ్యింది.

ఫోటోగ్రాఫర్ వి.ఎస్.ఆర్.స్వామి గారి సమర్పణ లో నిర్మాత శాఖమూరి రామచంద్రరావు గారు, హిందీ చిత్రం “ఆమానుష్” (1975) ఆధారంగా ఇందిరా మూవీస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు వి.మధుసూదనరావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ; శక్తిపాద రాజ్ గురు, స్క్రీన్ ప్లే: వి.మధుసూదనరావు, మాటలు: సత్యానంద్, పాటలు: శ్రీ శ్రీ, వేటూరి సుందరరామమూర్తి, కొసరాజు, సంగీతం: సత్యం, ఫోటోగ్రఫీ: వి.ఎస్.ఆర్.స్వామి, కళ: తోట తరణి, నృత్యం: శ్రీను, ఎడిటింగ్: కోటగిరి గోపాలరావు, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, వాణిశ్రీ, జయసుధ, జగ్గయ్య, సత్యనారాయణ, కాంతారావు, పద్మనాభం, ముక్కామల, జె.వి. రమణమూర్తి, సాక్షి రంగారావు, వల్లూరి బాలకృష్ణ,సారధి, జగ్గారావు, ఆనంద మోహన్
తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు సత్యం గారి సంగీత సారధ్యంలో పాటలు హిట్ అయ్యాయి.
“తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమంతిమొగ్గ”
“ఏ అత్తెరికి, బాలరాజో బంగారు సామి,”
“ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మాని పోదా,”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి.

ఈ చిత్రం ఎక్కువ భాగం ఔట్ డోర్ షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా లంక గ్రామాలలో చిత్రీకరించబడింది.

గోదావరి నది అందాల చిత్రీకరణలో వి.యస్.ఆర్.స్వామి గారి అద్భుతమైన ఫోటోగ్రఫీతో అదనపు ఆకర్షణగా నిలిచింది.

ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుని పలుకేంద్రాలలో 50 రోజులు అర్ధశతదినోత్సవాలు జరుపుకుని, రెండు కేంద్రాలలో 100 రోజులు ఆడింది. మొత్తంగా 112 రోజులు ప్రదర్శింపబడింది.

1. కాకినాడ – శ్రీదేవి (69 రోజులు) + ప్యాలస్ లో (43 రోజులు) =112 రోజులు ఆడింది
2. హైదరాబాద్ — సుదర్శన్ 35MMలో 70 రోజులు + షిఫ్ట్ ల మీద 100 రోజులు ఆడింది.

Related posts