శ్రీ నరేంద్రమోదీ చంద్రబాబు నాయుడు పవన్కళ్యాణ్ లకు ట్వీట్ ల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
“ఎన్నికల్లో నరేంద్రమోదీ గారు వరుసగా మూడోసారి అద్భుత విజయం. NDA 3.0 మన దేశాన్ని ఒక దేశంగా మరియు ప్రజలుగా మనందరికీ గొప్ప అభివృద్ధి మరియు కీర్తి మార్గంలో ఉంచుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను”! శుభాకాంక్షలు!!!
“కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది.
నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది” !!
“ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు.
ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం.
రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను”. !