ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ ఘన విజయం సాధించడంతో కుటుంబసభ్యులు, పార్టీ వర్గాలు, అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
కొందరు నేరుగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా జనసేనానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక మంగళవారం ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పవన్ మంగళగిరికి చేరుకున్నారు. ఆయన వెంట హీరో సాయి ధరమ్‌తేజ్‌తో పాటు పవన్ తనయుడు అకీరా నందన్ కూడా ఉన్నారు.
అయితే మంగళగిరికి చేరుకున్నాక సాయి తేజ్ ఉత్సాహంతో తన మేనమామ పవన్‌ను గట్టిగా హత్తుకుని మరోసారి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎత్తుకుని మరీ శుభాకాంక్షలు తెలిపారు.
దీనికి సంబంధించిన వీడియోను సాయి షేర్ చేస్తూ “మీ గెలుపే మా పొగరు. జనసేనాని పవన్ కల్యాణ్ నా హీరో, గురువు” అని పవన్‌పై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు.
మీ గెలుపే మా పొగరు.. మా జనసేనాని ❤️🔥😍 @pawankalyan garu my hero,my guru,my heart, most importantly MY SENANI 💪🏼💪🏼💪🏼 pic.twitter.com/qD2oXYtONH
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 4, 2024

