జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్టూన్లతో జగన్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వినూత్న రీతిలో విమర్శలు చేస్తున్నారు. వరుసగా ఒక్కో సమస్యపై జగన్ సర్కార్ వైఫల్యాన్ని వివరించేలా కార్టూన్ పెడుతున్నారు. ఆయన పోస్ట్ చేస్తున్న కార్టూన్లు వైరల్ అవుతున్నాయి.
— Pawan Kalyan (@PawanKalyan) July 9, 2022
తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల విలీనంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మేం కూడా మా చిన్నప్పుడు ఐదారు క్రోసులు నడుచుకుంటా బడికి వెళ్లేవాళ్లంరా.. మనవడా. మళ్లీ ఇప్పుడు మీ ముద్దుల సీఎం మామా.. మిమ్మల్ని వెనకటి రోజులకు తీసుకువెళ్తున్నాడన్న మాట!!’’ అంటూ పవన్ వ్యంగ్య కార్టూన్ ట్వీట్ చేశారు.

ముద్దులు మామయ్యంట, ముద్దులు మామయ్య దొంగ మామయ్య, బడిదొంగ మామయ్య అని పిల్లలు కోపంగా చూస్తూండటాన్ని కార్టూన్‌గా వేయించి తన ట్విట్ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
నిరుద్యోగ సమస్యపై కార్టూన్‌ను పోస్ట్ చేశారు. జాబ్ క్యాలెండ్ చేతిలో పెట్టి జాబుల్లేకుండా చేసిన విషయాన్ని అందులో వివరించారు.
#Apjobcalendar pic.twitter.com/j6dTEBOz6F
— Pawan Kalyan (@PawanKalyan) July 7, 2022
మద్య నిషేధంపైనా ఇలాంటి కార్టూనే పోస్టు చేశారు. ఖరీదైన మద్యాన్ని నిషేధించామని అంటే బ్రాండెడ్ లిక్కర్ నిషేధించామని ఓ వైసీపీ నేత వాదిస్తున్న వైనం వివరించారు.
— Pawan Kalyan (@PawanKalyan) July 5, 2022
ప్లీనరీ సందర్భంగా నరవత్నాల్లోని లోపాలను ప్రశ్నిస్తూ .. .నవ సందేహాలను కూడా పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ ప్రయత్నానికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కార్టూన్లను విపరీతంగా షేర్ చేస్తున్నారు. అసలు నేరుగా విమర్సలు చేయకుండా కార్టూన్ ద్వారా చెబితే ప్రజల్లోకి బాగా వెళ్తుందని జనసేన వర్గాలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.
— Pawan Kalyan (@PawanKalyan) July 3, 2022


జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు: యనమల