telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఎల్పీజీ సిలిండర్ ధర పెంపు : మంచిరోజులు వచ్చేశాయ్..భార‌తీయ మహిళలకు మంచి గిప్ట్ ఇచ్చారు..

తరచూ ట్విటర్​ వేదికగా కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచడంపై తీవ్రంగా మండిపడ్డారు.

మంచిరోజులొచ్చేశాయ్.. అందరికీ శుభాకాంక్షలు’. .వంటగ్యాస్ ధరలను కేంద్రం మరోసారి పెంచేసింది. ప్రధాని మోడీ సిలిండర్ ధరను పెంచి గ్యాస్ వినియోగదారులకు, భార‌తీయ మహిళలకు మంచి కానుక ఇచ్చారు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు

గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరను 50 రూపాయల మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గ్యాస్ బండ రేటు రూ.1100 దాటేసింది. ఇక చమురు సంస్థల తాజా నిర్ణయంతో హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. ఇందులో భాగంగానే కేంద్రానికి మరోసారి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

Related posts