వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మహానేత వైఎస్సార్‌కు ఆదర్శ సతీమణిగా నిలిచారని.. జననేత వైఎస్ జగన్‌కు జన్మనిచ్చి ధన్య మాత అయ్యారు అని అన్నారు.
ఈ సందర్భంగా మీకు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా అంటూ విజయసాయి రెడ్డి ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. వైఎస్ జగన్, విజయమ్మలతో కూడిని ఓ ఫొటోను కూడా విజయసాయి రెడ్డి షేర్ చేశారు.
మరోవైపు.. విజయమ్మ జన్మదినం సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి
వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహానేతకు ఆదర్శ సతీమణిగా నిలిచారు. జననేతకు జన్మనిచ్చి ధన్య మాత అయ్యారు. ఈ సందర్భంగా మీకు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. pic.twitter.com/Iy64wWb5vc
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 19, 2022


ట్రయల్ మొదలైతే జగన్ దృష్టంతా కోర్టు బోనుపైనే: యనమల