*ఈ రోజు ఢిల్లీకి సీఎం జగన్
*సాయంత్రం 4.45నిముషాలకు పిఎం మోదితో సీఎం జగన్ భేటి కానున్నారు..
*రెండురోజులపాటు ఢిల్లీలోనే సీఎం జగన్ మకాం..
*రేపు ఆర్ధికమంత్రి నిర్మాల సీతారామన్ ,జలవనరుల మంత్రితో భేటి..
*విభజన హామీల్లో ఉన్న ఫెండింగ్ నిధులు గురించి చర్చ..
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన హస్తిన వెళ్తున్నారు.
ఈ రోజు సాయంత్రం 4.45 నిముషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో మోటీ కానున్నారు. ఆ తరువాత రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవనున్నారు.
రేపు ఆర్ధికమంత్రి నిర్మాల సీతారామన్ ,జలవనరుల మంత్రితో భేటి కానున్నారు.. ఇప్పటికే వారి అపాయింట్మెంట్లు ఖరారు అయినట్లు సీఎంఓ నుంచి వార్తలు వస్తున్నాయి.
రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు అవసరం గురించి, 26 జిల్లాల ఏర్పాటు విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశముంది. అలాగే పోలవరం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ల వంటి అంశాలతోపాటు విభజన చట్టంలోని అపరిష్కృత హామీల అమలుపైనా సీఎం ప్రధానితో చర్చిస్తారని సమాచారం.
23మంది టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారు: ఎమ్మెల్యే గోరంట్ల