telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి ఫరూక్ కు సీఎం చంద్రబాబు పరామర్శ

ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్‌ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

హైదరాబాద్లో శనివారం సీఎం చంద్రబాబు ఫరూక్ ఇంటికెళ్లారు.

ఇటీవల ఫరూక్ సతీమణి షెహనాజ్ అనారోగ్యంతో మృతి చెందారు.

ఈ నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి ఫరూక్, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

పరామర్శించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు.

Related posts