telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆ అధికారం శాసన వ్యవస్థదే..కోర్టులకు లేదు: ధర్మాన ప్రసాదరావు

*ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై చర్చ..

*హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ ధర్మాన అభిప్రాయం

*హైకోర్టు తీర్పు సున్నితమైంది..
*కోర్టులంటే గౌరవం ఉంది..
*కోర్టులు త‌మ ప‌రిధిని దాటి ప్ర‌వ‌ర్తిస్తున్నాయి..
*రాజ్యాంగాన్ని ఇచ్చిన అధికారాన్ని ఎవ‌రో నిరోధిస్తే ఎలా..?
*హైకోర్టు వ్యాఖ్య‌లు బాధ క‌లిగించాయి..
*రాజ్యాంగం ప్ర‌కార‌మే ఈ స‌భ ఏర్పాటైంది..

మూడు రాజధానుల అంశంపై ఏపీ అసెంబ్లీలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్బంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్య‌లు చేశారు. మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయొద్దంటూ హైకోర్టు తెలిపింది . 3 రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను సీఎంకు లేఖ రాసిన విషయాన్ని ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో చర్చించినట్టుగా ఆయన చెప్పారు.

గతంలో రాజరిక వ్యవస్థ ఉండేదని.. రాజు ఏం చెబితే అది నడిచేదని పేర్కొన్నారు. అధికారం రాజు దగ్గరే కేంద్రీకృతం కావడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చేదని.. అక్కడి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిందని ఎమ్మెల్యే ధర్మాన పేర్కొన్నారు.

ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధులతో పాలన చేయాలని రాజ్యంగం చెప్పింది. ప్రజాభిప్రాయం కేవలం శాసన వయవస్థలోనే ప్రభావితం అవుతుందన్నారు. శాసనసభ అధికారాల విషయంలో కోర్టుకు అభ్యంతరాలుంటే ఎన్నికలెందుకని ఆయన ప్రశ్నించారు.శాసనసభను ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఎన్నుకొన్నారన్నారు.

శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే అది ప్రజలు చూసుకుంటారన్నారు. అంతే కానీ శాసన వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. రాజ్యాంగంలోని మూడు వ్యవస్థల పరిధి ఎంత మేరకు అన్నది కోర్టులో చెప్పాలని.. ఎంత నిగ్రహంతో కోర్టులు వ్యవహరించాలో కూడా ప్రస్తావించిందన్నారు.

న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు వేటికవే వ్యవహరించాల్సిన అవసరం ఉందని  ప్రసాదరావు చెప్పారు. ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని ధర్మాన గుర్తు చేశారు. మూడు వ్యవస్థల్లో ప్రజాభిప్రాయాన్ని తెలిపేది శాసన వ్యవస్థేనని ఆయన చెప్పారు. లోక్‌సభ, శాసనసభల్లోని సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకొంటున్నారని ధర్మాన చెప్పారు.

కోర్టులంటే అందరికీ గౌరవం ఉందని ధర్మాన పేర్కొన్నారు. అధికార వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని ,సమాజం పట్ల పూర్తి బాధ్యత ఉందని సుప్రీంకోర్టు గతంలో ప్రకటించింది. ఒకవేశ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే అది ప్రజలు చూసుకుంటారు. అంతే కానీ శాసన వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగంలోని మూడు వ్యవస్థల పరిధి ఎంత మేరకు అన్నది కోర్టులో చెప్పాలి. ఎంత నిగ్రహంతో కోర్టులు వ్యవహరించాలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది.

ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు అన్న విషయాన్ని కోర్టులు గుర్తుపెట్టుకోవాలి. సమానమైన హక్కులు, అధికారాలు మూడు వ్యవస్థలకు కూడా ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలని త తీర్పులు ఎన్నో చెప్పాయి. న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులదే అని చెప్పాయి. లేని అధికారాలను కోర్టులు సృష్టించుకోలేవని సుప్రీం తీర్పుల్లో స్పష్టంగా ఉంది’ అని ధర్మాన తెలిపారు.

Related posts