*మహబూబాబాద్ హోలీ సంబరాల్లో కిక్కు
*హోలీ వేడుకల్లో రంగులతో పాటు లిక్కర్
*మహబూబాబాద్ ఎమ్మెల్యే నోటి నోటికి లిక్కర్ సప్లై..
తెలంగాణ వ్యాప్తంగా డీజే పాటలతో హోళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. మహబూబాబాద్ జిల్లాలో హోలీ సంబరాలు ఫుల్ జోష్ మధ్య జరుగుతున్నాయి.
హోలీ పండుగను పురస్కరించుకొని నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ముఖ్యకార్యకర్తలంతా మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.
అయితే.. హోలీ వేడుకల్లో పాల్గొన్న అ ధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మందు బాటిళ్లతో హల్చల్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. చేతులో మందు బాటిల్ పట్టుకుని కార్యకర్తలతో కలిసి చిందులేశారు..
అంతటితో ఆగకుండా..మందు బాటిల్‌తో ఒక్కో కార్యకర్త దగ్గరకు వెళ్లి.. నేరుగా వారి నోట్లోనే లిక్కర్ పోస్తూ కనిపించారు. ఇంకొందరు కార్యకర్తలకు బాటిళ్లు పంచిపెట్టారు.
అయితే, హోలీ సందర్భంగా ప్రభుత్వం రెండురోజులు పాటు అమ్మకాలు నిషేధిస్తే.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాత్రం.. హోలీ వేడుకల్లో కార్యకర్తల నోట్లో మందు పోస్తూ చిందులు వేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది .