telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

బ్యాంకు లాకర్లు భేష్ .. దాచిన డాకుమెంట్స్ కు చెదలు.. !!

documents in bank locker smashed

బ్యాంకు లకర్లంటే ఎంతో రక్షణ ఉన్న స్థలంగా భావించి విలువైన పత్రాలు, బంగారు ఆభరణాలను అందులో దాచుకుంటాం. కానీ, అక్కడ కూడా వాటికి రక్షణ లేదని ఈ సందర్భం స్పష్టం చేస్తుంది. ఇటీవల బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో నగల కోసం లాకర్ ఓపెన్ చేసిన అతడికి మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. లోపల విలువైన దస్తావేజులు కాస్తా చెదలు పట్టి పూర్తిగా ధ్వంసమయ్యాయి. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ బహదూర్‌గూడకు చెందిన ఉపాధ్యాయుడు గంధం వెంకటయ్య.. తన భార్య కరుణశ్రీ బంగారు నగలతోపాటు మూడు ప్లాట్లకు సంబంధించిన దస్తావేజులను మన్సూరారాబాద్‌ డివిజన్‌ సహారా రోడ్డులోని బ్యాంకు లాకర్‌లో ఐదేళ్ల క్రితం భద్రపరిచారు.

బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో నగల కోసం బ్యాంకుకు వెళ్లిన వెంకటయ్య లాకర్ తెరిచి నిర్ఘాంతపోయారు. అందులోని దస్తావేజులను చెదలు పూర్తిగా ధ్వంసం చేశాయి. దీనితో లబోదిబోమన్న వెంకటయ్య అధికారులకు ఫిర్యాదు చేశాడు. గత డిసెంబరులో చూసినప్పుడు బాగానే ఉన్నాయని, ఇప్పుడు పూర్తిగా పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ సోమశేఖర్ మాట్లాడుతూ.. దస్తావేజులను చెదలు తినేసిన విషయం తమకు తెలియదన్నారు. అందులో పెట్టిన వస్తువులకు తాము బాధ్యత వహించబోమని, లాకర్ సదుపాయం మాత్రమే తాము కల్పిస్తామని చెప్పుకొచ్చారు. లాకర్‌లోకి నీరు చేరడం వల్లే ఇలా జరిగి ఉంటుందని లాకర్‌ను సరఫరా చేసిన గోద్రెజ్ కంపెనీ తెలుగు రాష్ట్రాల మేనేజర్ నరసింహారావు పేర్కొన్నారు.

Related posts