వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్లో సొమ్మసిల్లి పడిపోయారు. పక్కనే ఉన్న సహచర ఎంపీలు వెంటనే ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.
బీపీ, షుగర్ ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.


ఐదేళ్లలో జరగని అభివృద్ధి ఐదు నెలల్లో జగన్ చేశారు: మంత్రి అవంతి