స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. కమర్షియల్‌గా పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాను ఇంత ఘన విజయం అయినందుకు చిత్రయూనిట్ థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు…
ఈ సందర్భంగా ‘పుష్ప’థ్యాంక్స్ మీట్లో అల్లు అర్జున్ సమంత గురించి మాట్లాడుతూ… ‘స్పెషల్ సాంగ్ చేసిన సమంతకు థ్యాంక్స్… ఈ పాటను మీరు ఎంత నమ్మారో గానీ.. మేం మిమ్మల్ని ఇంత నమ్ముతున్నామని, మీరు మమ్మల్ని నమ్మారు.. మా మీద నమ్మకంతో చేశారు కదా? ఆ నమ్మకానికి థ్యాంక్స్. సెట్లో నీకు ఎన్ని అనుమానాలు వచ్చాయో ఉన్నాయో నాకు తెలుసు.. తప్పా? ఒప్పా? అని ఆలోచించావ్.. నన్ను నమ్ము అని నేను ఒక్క మాట చెప్పడంతో ఇంకో ప్రశ్న కూడా వేయలేదు. చేసేశావ్. అది నా గుండెను తాకింది. ఏది అడిగినా కూడా ఆలోచించకుండా చేశావ్.. నీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది.
ప్రపంచంలోనే నెంబర్ వన్ సాంగ్‌గా యూట్యూబ్‌లో నిలబడటం అంటే మామూలు విషయం కాదు. ఊ అంటావా? ఊ ఊ అంటావా? అని ఎవ్వరికీ ఏ ఆప్షన్ ఇవ్వకుండా అందరూ ఊ అనాల్సిందే అనే రేంజ్లో సాంగ్ ఉంది అంటూ..థ్యాంక్యూ సామ్ అంటూ బన్నీ మాట్లాడాడు.
తనను అభినందిస్తూ.. బన్నీ చేసిన వ్యాఖ్యలకు సమంత రిప్లై ఇచ్చింది. బన్నీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. ‘ఇకపై నేను మిమ్మల్నిఎప్పడూ నమ్ముతాను’అని ట్వీట్ చేసింది.
అలాగే.. సమంత ట్వీట్‌పై బన్నీ రియాక్ట్ అయ్యాడు. బ్లాక్ హార్ట్ ఎమోజీని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
And now I will always trust you @alluarjun 🙌🙇♀️ https://t.co/EQOGv6M10F
— Samantha (@Samanthaprabhu2) December 28, 2021
కాగా.. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని ఇప్పటికే కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. అలాగే ఓ హాలీవుడ్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
.