telugu navyamedia
సినిమా వార్తలు

అభిమానితో మెగాస్టార్ కొత్త సినిమా షూరూ..

మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచారు. ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు ఇప్పుడు వరుస సినిమాల‌తో కుర్ర హీరోలకు ఏమాత్రం త‌క్కువ కాకుండా వరుస సినిమాల‌తో టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు.ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్..తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరికొత్త చిత్రం కి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు వెలువడింది. ‘ఛలో’, ‘భీష్మ’ లాంటి యూత్​ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు.

Acharya trends on social media as fans look forward to Chiranjeevi Konidela  and Kajal Aggarwal starrer | Telugu Movie News - Times of India

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కించబోయే చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా డాక్టర్ మాధవి రాజు వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది.

అయితే మెగాస్టార్ చిరంజీవి గారి తో సినిమా చేయడం పట్ల నిర్మాత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కల నెరవేరింది అంటూ చెప్పుకొచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్ తెలిపారు వెంకీ కుడుముల. ఈ చిత్రం కోసం చాలా కష్టపడి పని చేస్తా అని, తనను నమ్మినందుకు థాంక్స్ తెలిపారు వెంకీ కుడుముల. మెగాస్టార్ చిరంజీవి సరికొత్త చిత్రం ప్రకటన తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Official: Venky Kudumula To Direct Megastar - Movie News

ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా పూర్తిచేశారు చిరంజీవి. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు.

అలాగే 153వ సినిమాగా రానున్న లూసిఫర్‌ రీమేక్‌ ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కొన్ని నెలల కిందట ప్రారంభమైంది. ఇక మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’, బాబీ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా చిత్రీకరణ కూడా ఈ మధ్యే ప్రారంభమైంది.

తాజాగా తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ వెంకి కుడుముల దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి సరికొత్త చిత్రం ప్రకటన తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts