బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు తన ప్రేయసి పాత్రలేఖతో పెళ్లికి సిద్ధమయ్యాడు. రాజ్‌కుమార్‌రావు, పాత్రలేఖ ఈ నెలలో పెళ్లి చేసుకోనున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నారు.
న్యూ చండీగఢ్‌లోని ఒబెరాయ్ సుఖ్విలాస్ స్పా రిసార్ట్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. వీరి వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రాజ్‌కుమార్ తన మోకాలి మీద కూర్చొని “పత్రలేఖా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని అడిగాడు. బదులుగా పాత్రలేఖ “రాజ్‌కుమార్ రావ్, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అని అడిగారు. అనంతరం అతిథుల ఆనందోత్సాహాల మధ్య ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఓ రొమాంటిక్ సాంగ్‌కి డ్యాన్స్ చేశారు.
రాజ్‌కుమార్ తెల్లటి కుర్తా-చురీదార్లో మ్యాచింగ్ జాకెట్ మరియు స్పోర్ట్స్ షూస్‌తో సింపుల్‌గా ఉండగా, పాత్రలేఖ పొడుగ్గా ఉన్న తెల్లటి ఆఫ్-షోల్డర్ గౌను ధరించింది.
కాగా..దాదాపుగా ఏడేళ్ల నుంచి రాజ్‌కుమార్, పత్రలేఖ డేటింగ్లో ఉన్నారు. అయితే ఎప్పుడు తమ బంధంపై అధికారికంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో తాము వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.
ఈ వేడుకలో అతిథులతో పాటు నటుడు సాకిబ్ సలీమ్ మరియు చిత్రనిర్మాత ఫరా ఖాన్ కూడా పాల్గొన్నారు. వీరి ఎంగేజ్మెంట్ కోసం హోటల్ని వైట్ లైట్లతో ఎంతో అందంగా అలంకరించారు.
సెక్రటేరియట్ వాస్తు ప్రభావం వల్ల ‘దొర’కి ఆరోగ్యం బాగుండటం లేదంట.. మాధవీలత షాకింగ్ పోస్ట్