యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్( రౌద్రం.. రణం.. రుధిరం). ఈ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ ఆయిన పోస్టర్స్, గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ పేరుతో తారక్, చెర్రిలకు సంబంధించిన ఫుల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఇందులో రామ్‌చరణ్, ఎన్టీఆర్.. ఊరమాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. ఎంఎం కీరవాణి స్వరాలు అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సాంగ్‌ను విడుదల చేశారు. దీంతో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అంటూ ఓ రేంజ్ లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు.అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ, రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాపంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.