telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఘనంగా ముగిసిన పైడితల్లి సిరిమానోత్సవం..

ఉత్తరాంధ్రులకు కల్పవల్లి, విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడి తల్లి అమ్మ వారి సిరిమానోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దసరా నుండి మొదలయ్యే వేడుకల్లో.. ఇవాళ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరుగుతుంది.

విజయనగరం రాజుల ఆధ్యాత్మిక వైభవం పైడి తల్లి ఉత్సవాలకు తలమానికం ఈ సిరిమానోత్సవం. ఇది రాష్ట్ర పండగ.. రెండున్నర శతబ్దాలకు పై బడి నిరంతరాయంగా ఈ పండుగ జరుగుతూ వస్తోంది. ఏడాదికి పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

పైడితల్లి ఉత్సవాల్లో తొలి ఘట్టం తోలేళ్ల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సిరిమాను వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీతో పాటు… పక్కరాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు. నవంబరు 3న వనంగుడిలో జరిగే చండీహోమంతో ఇవి ముగుస్తాయి.

ఐతే కరోనా కారణంగా అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. ఐతే అధికారుల సూచనలను పక్కనబెట్టిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో 2,500మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు అధికారులు .

అమ్మ వారి ప్రధాన ఆలయం వద్ద భద్రతను జిల్లా ఎస్పీ ఎం. దీపిక స్వయంగా పరిశీలించారు. క్యూ లైన్స్ లో ఉన్న భక్తులకు కోవిడ్ నిబంధనలను పాటించాలని ఎస్పీ సూచించారు. మహిళా భక్తులకు దిశా యాప్ పట్ల అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్టాల్ ను ఎస్పీ సందర్శించి పలు సూచనలు చేశారు.

జయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆధ్వర్యంలో పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లను, సేవలను అందించి భక్తుల మన్నలను పొందారు. అమ్మవారి దర్శనార్ధం వచ్చిన వృద్దులు, దివ్యాంగులకు పోలీస్ సేవాదళ్ సభ్యులు పలు సేవలు అందించారు.ఈ బందోబస్త్ లో విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ పి. సత్యనారాయణ త‌దిత‌ర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts