ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 4,14,188 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 3,915 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,31,507 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,14,91,598 కాగా.. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 36,45,164 గా ఉన్నాయి. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 2,34,083 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 85.6 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 13.26 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.18శాతానికి మరణాల రేటు తగ్గింది.
previous post
next post


కశ్మీర్ విభజనపై కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు