telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఈ నెల నుండే ప్రైవేట్ ఉపాధ్యాయులకు సాయం…

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి . విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2000 నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక, రాష్ట్రంలోని ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం అందిస్తామన్న సాయంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడియన మంత్రులు.. ఏప్రిల్‌ నుంచే ప్రైవేట్‌ టీచర్లకు సాయం అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అయితే ఏప్రిల్ 10 నుంచి 15 మధ్య లబ్ధిదారుల డేటాను అప్‌లోడ్ చేయాలని.. ఏప్రిల్ 16 నుంచి 19 వరకు పరిశీలన, ఫిర్యాదుల పరిష్కారం జరుగుతుందన్నారు. ఇక, ఏప్రిల్ 20 నుంచి 24 వరకు రూ .2,000 మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని.. అదేవిధంగా బియ్యం కూడా లబ్ధిదారులకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయబడుతుందని తెలిపారు. అయితే ఇందుకుగాను నెలకు రూ.42 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్టు తెలిపారు.

Related posts