telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సామన్య పౌరుడిలా కరోనా టీకా వేయించుకోనున్న సీఎం జగన్‌

cm jagan

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఏపీలో 8.98 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ రిలీజ్‌ చేసిన ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 997 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,99,812 కు చేరింది. ఇందులో 8,86,498 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,104కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,210 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు కరోనా టీకాలు వేసుకుంటున్నారు. ప్రధాని మోడీ కూడా టీకా వేయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్‌ 1న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోనున్నారు. గుంటూరు భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయంలో ఆయన కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోనున్నారు. భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయాన్ని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 నుంచి సచివాలయాల్లో కోవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెస్తున్నామన్నారు మోపిదేవి. ప్రజల్లో అపోహలు తొలగాలనీ.. ప్రభుత్వ సలహాలు, సూచనలు పాటించాలని సూచించారు.

Related posts