రూరల్ ఏరియాలో పైలట్ ప్రాజెక్టుగా మండలంలో వారంలో నాలుగు రోజులు, రోజుకు 2 గ్రామాలు చొప్పున వ్యాక్సినేషన్ చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ మరో 6 రోజులు మాత్రమే మిగిలి ఉందన్న ఆయన ఈ ఎన్నికలు వెంటనే పూర్తయి ఉంటే వ్యాక్సినేషన్‌పై పూర్తి దృష్టి పెట్టేవాళ్లం.. కాని అలా జరగలేదని, మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. దీనివల్ల వ్యాక్సినేషన్‌కు అడ్డంకులు వచ్చే పరిస్థితి ఉందని, అధికార యంత్రాంగంలో సందిగ్ధ వాతావరణం ఉంది, ఇలాంటి సందిగ్థత వాతావరణం మధ్య అంతా ఉన్నాం. ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఇలాంటి పరిస్థితులకు బాధ్యులు ఎవరు? చాలా ఆవేదన కలుగుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా మనం చేయాల్సిన పని మనం చేయాలన్న ఆయన వ్యాక్సినేషన్‌ను ఉద్ధృతంచేయండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే యజ్ఞం ముమ్మరంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు.
previous post
next post